|
|
హైదరాబాద్ లో 144 సెక్షన్ కేవలం మతకలహాలు జరిగినప్పుడు మాత్రమే ఉండేది. కానీ ఈ నెల 27 వతేదీ నుంచి హైద్రాబాద్ లో 144 సెక్షన్ అమలవుతోంది. మంత్రి పొంగులేటి సియోల్ పర్యటనలో ఉన్నప్పుడు పొలిటికల్ బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. దీపావళికి ముందు ఒక ఎత్తు దీపావళి తర్వాత ఒక ఎత్తు అని పొంగులేటి ఇచ్చిన స్టేట్ మెంట్ కొత్త చర్చకు దారి తీస్తుంది. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో పొంగులేటి ప్రకటన క్లూ దొరికినట్టు తెలుస్తోంది. ఇందిరాపార్క్ వద్ద ధర్నా కార్యక్రమాలకు మినహాయింపు ఉంటుందని పోలీస్ కమిషన్ సివి. ఆనంద్ వెల్లడించారు జన్వాడా ఫాంహౌజ్ లో పోలీసుల దాడుల నేపథ్యంలో కెటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది . కెటీఆర్ టార్గెట్ గా గత కొంతకాలంగా ప్రకటనలు వెలువడుతున్నాయి. జన్వాడ ఫాం హౌజ్ లో కుటుంబ సభ్యులు పట్టపట్టడంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కెటీఆర్ అరెస్ట్ కు అనుకూల వాతావరణం ఏర్పడింది. .బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళన ఉగ్రరూపం దాల్చడంతో 144 సెక్షన్ అమలవుతోందని తెలుస్తోంది నవంబర్ 1 నుంచి 8 వరకు బిఆర్ఎస్ కీలక నేతలు అరెస్ట్ కానున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో కెసీఆర్ , హరీష్ రావులు అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే కాళేశ్వరం దర్యాప్తు ఫైనల్ స్టేజిలో ఉంది. కెసీఆర్ తర్వాత కెటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ కెటీఆర్ టార్గెట్ గా పని చేస్తోంది. కెటీఆర్ బామ్మర్ది కి రాజ్ పాకాల చెందిన జన్వాడా ఫాం హౌజ్ లో దాడులు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తెలంగాణ డిజిపికి ఫోన్ చేసినట్టు సమాచారం. తన కుటుంబాన్ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని కెసీఆర్ డిజిపి జితేందర్ పై అగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.